: జూనియర్ ఎన్టీఆర్ ను చూడగానే.. ఈడు దొరికాడేంటి అనుకున్నా: రాజమౌళి
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బంపర్ హిట్లే. వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. రాజమౌళి తొలి సినిమా 'స్టూడెంట్ నంబర్ 1' హీరో కూడా ఎన్టీఆరే! తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాను శాంతినివాసం సీరియల్ చేస్తున్నప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రాజెక్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు వచ్చిందని... అయితే, ఆ అవకాశాన్ని ఆయన తనకిచ్చారని చెప్పారు. అయితే హీరో పాత్ర పోషించనున్న తారక్ ను చూడగానే... 'ఓరి దేవుడా... నా మొదటి సినిమాకు ఈడు దొరికాడేంటి' అనుకున్నానని... అయితే, పది రోజుల్లో తారక్ లో ఉన్న నటుడేంటో తనకు అర్థమయిందని చెప్పారు. ఎన్టీఆర్ చాలా టాలెంట్ ఉన్న నటుడంటూ కితాబిచ్చాడు.