: గత ఏడాది టీడీపీ ఆదాయం రూ.72.9 కోట్లు


గత ఏడాదిలో తెలుగుదేశం పార్టీ ఆదాయ వ్యయాలను ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. విశాఖలో జరుగుతున్న మహానాడులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గత ఏడాదిలో టీడీపీ ఆదాయం రూ.72.9 కోట్లు కాగా, వ్యయం రూ.24.3 కోట్లు అని పేర్కొన్నారు. పార్టీ జమ, ఖర్చులను సభ ఆమోదిస్తుందని ఆయన ఆకాంక్షించారు. కాగా, విశాఖలో జరుగుతున్న మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News