: జేసీ ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. ఒకరి అరెస్ట్
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫేస్ బుక్ లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి పోలీసులు రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.