: చిరంజీవితో నేను చేసిన చిత్రాలన్నీ శతదినోత్సవాలు జరుపుకున్నాయి!: సీనియర్ నటి రాధ
చిరంజీవితో నటించడం తన అదృష్టమని నాటి నటి రాధ అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చిరంజీవితో కలిసి పదహారు చిత్రాల్లో హీరోయిన్ గా నటించానని, ఆ చిత్రాలన్నీ శతదినోత్సవం చేసుకున్న సినిమాలేనని చెప్పారు. తన చిత్రాలన్నీ దాదాపు విజయవంతమయ్యాయని, కాకపోతే, తాను పోషించిన పాత్రలన్నీ ‘గ్లామరస్’వేనని, స్టెప్స్ బాగా వేస్తానని అభిమానులు అనేవారని గుర్తు చేసుకున్నారు. సీరియస్ పాత్రల్లో మాత్రం తాను నటించలేదని చెప్పిన రాధ, తెలుగు చిత్ర పరిశ్రమను తాను ఎన్నటికీ మరువలేనని అన్నారు.