: 'ఛలో అమరావతి'కి ముద్రగడ పిలుపు.. రూట్ మ్యాప్ చంద్రబాబుకే పంపిస్తానన్న కాపు నేత


కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే కారణంతో... ఆయన 'ఛలో అమరావతికి' పిలుపునిచ్చారు. జూలై 26తో కాపు ఉద్యమానికి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 26న తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.

 కాపుల రిజర్వేషన్ల అంశంపై వేసిన మంజునాథ కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించిందని... అయినా, చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసినా... కనీస స్పందన కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కాపులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తమ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను నేరుగా చంద్రబాబుకే పంపిస్తామని చెప్పారు.  

  • Loading...

More Telugu News