: పెద్ద డైరెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం: ‘జబర్దస్త్’ ఆర్పీ


సినిమా రంగంలో పెద్ద డైరెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని ‘జబర్దస్త్’ నటుడు రాటకొండ ప్రసాద్ (ఆర్పీ) అన్నాడు. ఆర్పీ సొంత ఊరు నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలంలో ఉన్న సగటూరు. షూటింగ్ లేని సమయంలో తన వారిని కలుసుకునేందుకు సొంతూరు వచ్చిన ఆర్పీని ఓ న్యూస్ ఛానెల్ పలుకరించగా ఆసక్తికర విషయాలు చెప్పాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరానని, ‘సాధ్యం’, ‘గురుడు’, ‘గేమ్’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని చెప్పాడు. 2014లో ‘జబర్దస్త్’ లో నటించడం మొదలుపెట్టానని, ఇప్పటి వరకు 270 స్కిట్స్ లో నటించానని చెప్పాడు. ఇప్పటికే పది సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించానని చెప్పిన ఆర్పీ, ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలో నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News