: అల్లు అరవింద్ పై కోపంతోనే 'మగధీర' 100 రోజుల వేడుకకు వెళ్లలేదు: రాజమౌళి


తాను ఎంత గొప్ప దర్శకుడో 'బాహుబలి' సినిమాతో రాజమౌళి నిరూపించుకున్నాడు. అయితే హీరో రామ్ చరణ్ కు 'మగధీర' ద్వారా సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళికి...  మెగా ఫ్యామిలీ నుంచి అందాల్సినంత గౌరవం అందలేదనే టాక్ సర్వత్ర ఉంది. ఈ విషయానికి సంబంధించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మగధీర విషయంలో నిర్మాత అల్లు అరవింద్ పై తనకు చాలా కోపాలు ఉన్నాయని ఆయన చెప్పాడు. అందుకే 100 రోజుల ఫంక్షన్ కు కూడా రాలేనని చెప్పినట్టు తెలిపాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని తెలిపాడు. ప్రభాస్ విషయంలో మాత్రం తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని చెప్పాడు. ప్రభాస్ ను 'ఏం ప్రభాస్ రాజు గారూ' అని పిలిస్తే... తెగ ఇబ్బంది పడిపోతాడని తెలిపాడు. 

  • Loading...

More Telugu News