: వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే సర్పంచ్ ను హత్య చేశాం: శ్రీనివాసరావు హత్య కేసు నిందితులు
గుంటూరు జిల్లా మాచవరం మండలం వేమవరం సర్పంచ్ పాశం శ్రీనివాసరావు హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసు విచారణలో వారు కీలక విషయాలను వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... వైసీపీ నేతల ప్రోద్బలంతోనే వారు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎంపీటీసీ చంద్రం తమను మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి వద్దకు తీసుకెళ్లాడని చెప్పారు. కృష్ణారెడ్డి సూచనతో శ్రీనివాసరావును హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశామని తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీన హత్య చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో షేక్ బషీర్, షేక్ జమాల్, షేక్ సైదా, షేక్ జిలాని, శివాజి, జోజిబాబులు ఉన్నారు.