: ‘మహానాడు’లో నేటి కార్యక్రమాలు


విశాఖపట్టణంలో నేటి నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. మహానాడులో నేటి కార్యక్రమాలు ఉదయం పది గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. ఆ తర్వాత పార్టీ పతాకావిష్కరణ, మా తెలుగు తల్లి గేయలాపన, జ్యోతి ప్రజ్వలనతో సమావేశాలు మొదలుకానున్నాయి. అనంతరం, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించడంతో పాటు, ఇటీవల మృతి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సంతాపం తెలుపుతారు. ప్రధాన కార్యదర్శి నివేదిక, జమా ఖర్చుల నివేదిక, నియమావళి సవరణలను ప్రవేశపెట్టిన అనంతరం, పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది. 

  • Loading...

More Telugu News