: రాహుకాలం.. ‘మహానాడు’కు చంద్రబాబు వెళ్లే సమయంలో మార్పు!


విశాఖపట్టణంలో నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరుగుతోంది. అయితే, ముందు నిర్ణయించిన సమయం ప్రకారం, ఈ రోజు ఉదయం 9.30 గంటలకు మహానాడు వేదిక వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోవాల్సి ఉంది. అయితే, ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 10.00 గంటలకు రాహు కాలం ఉందని పండితుల సూచన మేరకు చంద్రబాబు తన షెడ్యూల్ లో మార్పు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 10.10 గంటల తర్వాత మహానాడు వేదికకు చంద్రబాబు చేరుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News