: మూడు లేదా నాలుగు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!


మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 30 లేదా 31కి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని చెప్పారు. అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా 30 వ తేదీ కన్నా ఒక రోజు ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు భావించారు. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ముందుగానే ప్రకటించిన తేదీల్లోనే కేరళ, మాల్దీవులు, దక్షిణ అరేబియా సముద్రం పరిసరాలను రుతుపవనాలు తాకుతాయని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News