: చంద్రబాబు ఇంటికి సీసీటీవీలు.. రూ.36 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం


చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఇంటికి ఏర్పాటు చేయనున్న సీసీటీవీ కెమెరాల కోసం ఏపీ ప్రభుత్వం రూ.36 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో సీఎం ఇంటికి సీసీ టీవీ సిస్టంతోపాటు సోలార్ పవర్ ఫెన్సింగ్, ఇంటి బయట సెక్యూరిటీ కోసం లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ రెంటల్ హౌసింగ్ స్కీమ్ కింద ప్రభుత్వం శుక్రవారం ఈ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు  పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ను ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News