: ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం బరితెగించిన చిన్నారి.. తల్లిదండ్రులు ప్రైవేటుగా ఉన్నప్పుడు వీడియో.. రూ. కోటి డిమాండ్ చేస్తున్న ‘స్నేహితుడు’
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు వ్యసనపరుడిగా మారిన 13 ఏళ్ల కుర్రాడు తెలియని ఫ్రెండ్ కోసం చేసిన పని ఇప్పుడు అతని కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. స్నేహితుడి కోరిక మేరకు తల్లిదండ్రులు ప్రైవేటుగా ఉన్నప్పుడు వీడియో తీసి దానిని అతడికి పంపిస్తే.. ఆ వీడియో అందుకున్న స్నేహితుడు బ్లాక్ మెయిలర్‌గా మారి బెదిరింపులకు దిగాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని, లేదంటే వాటిని అడల్ట్ సైట్లలో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాలుడి తండ్రి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో వారు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. హీరోహళ్లి-ఆంధ్రాహళ్లి రోడ్లో బాధిత కుటుంబం నివసిస్తోంది. వారి 13 ఏళ్ల కుమారుడు గతేడాది జూన్‌లో ఫేస్బుక్లో ఖాతా ఓపెన్ చేశాడు. తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని ఓకే చేశాడు. ఏప్రిల్ 2017 చివరిలో తేజల్ పటేల్, చిన్నారికి అభ్యంతరకర చిత్రాలు పంపడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు పంపేవాడు.
అంతేకాదు బాలుడితో అసభ్యకరంగా చాట్ చేయడంతోపాటు అతడి న్యూడ్ ఫొటోలు పంపేవాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల న్యూడ్ ఫొటోలు పంపాల్సిందిగా బాలుడిని కోరాడు. అతడి కోరిక మేరకు తల్లిదండ్రులు ప్రైవేటుగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు. వాటిని అందుకున్న వెంటనే తేజల్ బ్లాక్ మెయిలర్‌గా మారిపోయాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోను అడల్ట్ వెబ్సైట్లలో పెడతానని బాలుడిని బెదిరించాడు. దీంతో భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని తేజల్ పటేల్ గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.