: సల్మాన్ చెంప వాయిస్తున్న మేనల్లుడి వీడియో చూడండి!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు అహిల్ ఖాన్ తో సరదాగా గడిపిన క్షణాలను వీడియో తీశాడు. ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. అహిల్ ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ తన రెండు చేతులతో ఎత్తి పట్టుకుని ఉండగా, ఎదురుగా ఉన్న సల్మాన్, తన మేనల్లుడి బుగ్గలపై సరదాగా గుద్దుతూ ఆటపట్టించాడు. అహిల్ కూడా, తన చేత్తో సల్మాన్ చెంపపై కొట్టడం, దెబ్బ తగిలినట్టు కండలవీరుడు నటించడం ఈ వీడియోలో ఉంది. కాగా, సల్మాన్ సోదరులు ఇద్దరూ ‘ట్యూబ్ లైట్’ చిత్రం టీ-షర్ట్స్ ధరించి ఉండటం గమనార్హం.