: ఇకపై, ఎక్కడా ‘సూపర్’ అనే పదం వాడను: యాంకర్ రవి
‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ వేడుకలో జరిగిన వివాదాస్పద వ్యాఖ్యల సంఘటన ఆ చిత్రం విడుదలైన తర్వాత హాట్ గానే ఉంది. మహిళలపై సినీ నటుడు చలపతి రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు..‘సూపర్ సార్’ అంటూ యాంకర్ రవి రెస్పాండ్ అవడం తెలిసిందే. ఆపై, విమర్శలు తలెత్తడంతో, సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో చలపతిరావు అన్న మాటలు తనకు వినిపించలేదని, ఆడియన్స్ అందరూ నవ్వుతుంటే, దాన్ని బట్టి ఆయనేదో పంచ్ వేసారనుకుని.. ‘సూపర్, సార్’ అని అన్నానని చెప్పడం తెలిసిన కథే. యాంకర్ రవి తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘నాకు మద్దతుగా నిలిచిన, ధైర్యం చెప్పిన వారికి ధన్యవాదాలు. ఇకపై ఎక్కడా కూడా ‘సూపర్’ అనే పదం ఉపయోగించను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.