: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి రెచ్చిపోయిన తాలిబాన్లు... 15 మంది జవాన్ల మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. ఆర్మీ బేస్‌పై దాడి చేసిన తాలిబన్లు 15 మంది సైనికుల ప్రాణాలు తీశారు. రెండు రోజుల క్రితం కూడా తాలిబాన్లు చేసిన దాడిలో పది మంది ఆఫ్ఘన్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. కాందహార్ ప్రావిన్సు షావలీ కోట్ జిల్లాలో గత అర్ధరాత్రి కూడా తాలిబన్లు దాడికి తెగబడ్డారని, 15 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని అక్కడి అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలో తాలిబాన్లు పదేపదే రెచ్చిపోతూ దాడులకు దిగుతున్నారని, వారు అక్కడ బలం పుంజుకున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.