: ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలి: బీజేపీ నేత పురంధేశ్వరి


బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ మరింత ఎక్కువ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా, బీజేపీ నేత పురంధేశ్వరి మాట్లాడుతూ, కేశినేని నాని చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారని, ఏపీలో అన్ని బూత్ లలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, కార్యకర్తల మనోభావాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మరో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ‘లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ’ అనే తమ మనసులో మాటను కార్యకర్తలు బయటపెట్టారని అన్నారు.

  • Loading...

More Telugu News