: రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించిన యూపీ పోలీసులు


ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో దళితులు, ఠాకూర్ వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు మొబైల్ ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను నిలిపివేశారు. ఈ క్రమంలో, సహరాన్ పూర్ వెళ్లేందుకు విపక్ష నేతలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతికి అక్కడకు వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అనుమతిని నిరాకరించారు. రేపు అక్కడకు వెళ్లడానికి రాహుల్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే ఒకరోజు ముందుగానే (నేడు) ఆయనకు అనుమతిని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News