: ఐసీఐసీఐ సీఎండీ చందా కొచ్చర్‌ వార్షికాదాయం ఎంతో తెలుసా?


ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ తమ వార్షిక నివేదిక వివరాలు తెలుపుతూ తమ సీఎండీ చందా కొచ్చర్‌ వార్షికాదాయం కూడా ప్రకటించింది. ఆమె సంవ‌త్స‌ర‌ ఆదాయం గ‌త ఏడాది కంటే 64 శాతం పెరిగింద‌ని, ప్ర‌స్తుతం ఆమె ఆదాయం రూ.7.85 కోట్లని తెలిపింది. ఆ లెక్కన ఆమె రోజుకి అందుకునే వేతనం రూ.2.18 లక్షలని పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆమె అందుకున్న బోనస్ మొత్తం రూ.2.2కోట్లుగా ఉంది. జీత భత్యాల పేరుతో ఆమె రూ.32 లక్షలను, గ్రాట్యుటీ కింద రూ.22 లక్షలు పొందారు. అందులో 13.75 లక్షల రూపాయల ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను కూడా కలపలేదు. ఈ ఏడాది భారీగా పెరిగిన బోనస్ తో ఆమె వేతనం ఏకంగా 64 శాతం పెరిగింద‌ని ఆ బ్యాంక్ పేర్కొంది.                     

  • Loading...

More Telugu News