: పొట్టి డ్రస్సు వేసుకొని వచ్చినందుకు నర్సు ఉద్యోగం ఊడిపోయింది!


పొట్టి డ్రస్సు వేసుకొని వచ్చిన కారణంగా ఓ న‌ర్సు త‌న జాబు కోల్పోయిన సంఘ‌ట‌న థాయిలాండ్‌లోని ఓ ఆసుప‌త్రిలో చోటుచేసుకుంది. పరిచత్ పాంగ్ చత్‌స్రి (26) అనే ఆ నర్సు ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమె థాయ్‌లాండ్‌లోని ఇసాన్ నగరంలోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తూ ఇటువంటి దుస్తులు ధ‌రించి వెళ్లింది. అయితే, థాయ్‌లాండ్‌లో ఇటువంటి దుస్తులు ధ‌రిస్తే త‌ప్పుగా భావిస్తారు. 'థాయ్ నర్స్ లవర్స్ అసోసియేషన్' అనే ట్విట్ట‌ర్ పేజీలో ఆమె ఫొటోల‌ను ఉంచి, ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఫొటోలను ఎంతో మంది షేర్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News