: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. 31వేల మార్కును దాటిన సెన్సెక్స్!
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు చరిత్ర సృష్టించాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 31వేల మార్కును ఆధిగమించింది. ఇదే బాటలో నిఫ్టీ కూడా ఒకానొక సమయంలో 9600 ఆల్ టైమ్ హై మార్క్ ను టచ్ చేసింది. మెటల్స్, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలను మూటగట్టుకున్నాయి. ఫార్మా స్టాక్స్ మాత్రం నష్టాలను చవిచూశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 278 పాయింట్లు లాభపడి 31,028కి ఎగబాకింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 9,585కి చేరింది.
బీఎస్ఈలో ఇవాల్టి టాప్ గెయినర్స్:
సింటెక్స్ ఇండస్ట్రీస్ (17.25%), హిందుస్థాన్ పెట్రోలియం (11.43%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (10.58%), దిష్మన్ ఫార్మా (9.06%), కావేరి సీడ్స్ (8.75%).
టాప్ లూజర్స్:
వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-9.99%), సాన్ ఫార్మా (-3.93%), బ్రిటానియా (-2.90%), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (-2.82%), సిప్లా (-2.48%).