: ‘బాహుబలి-2’ రికార్డును బద్దలు కొట్టిన ‘దంగల్’!
ప్రభాస్ ‘బాహుబలి-2’ సినిమాకు ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా గట్టి పోటీనిస్తోంది. దంగల్ ఇటీవలే చైనాలో విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ ఆ సినిమా దూసుకుపోతుండడంతో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ‘బాహుబలి-2’ సినిమా ఇప్పటివరకు మొత్తం రూ.1530 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే, ‘దంగల్’ చైనాలో సృష్టిస్తోన్న ప్రభంజనంతో మొత్తం రూ.1743 గ్రాస్ వసూళ్లు సాధించిందని ప్రముఖ విశ్లేషకుడు హరిచరణ్ పుడిపెద్ది వెల్లడించారు. ఈ నెల 5న చైనాలో విడుదలైన దంగల్ ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం రూ. 810 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో బాహుబలి-2ను దాటేసింది. అయితే, బాహుబలి-2 చైనాలో ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ‘బాహుబలి-2’ టీమ్ ఈ సినిమాను చైనాలో విడుదల చేయనుంది.
With its WW gross collections, #AamirKhan's #Dangal has officially beaten #Baahubali2 at the box-office. Well deserved success