: ఉరీ సెక్టార్ లో భారత సైన్యం, పాక్ రేంజర్ల మధ్య కాల్పులు.. ఇద్దరు పాక్ సైన్యం హతం
జమ్ము కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో కలకలం చెలరేగుతోంది. భారత్‌పై ప్రతీకారం అంటూ రగిలిపోతున్న పాకిస్థాన్ రేంజర్లు ఈ రోజు అక్కడి భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అయితే, వెంటనే తేరుకున్న భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దీంతో ఇద్దరు పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సిబ్బంది హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్‌వోసీ వద్ద పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ స్థావరాలపై ఇటీవలే భారత ఆర్మీ దాడి చేసి పలు క్యాంపులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.