: అతిపెద్ద వంతెనకు నామకరణం చేసిన మోదీ!


అసోం, అరుణాచల్ ప్రదేశ్ లను కలుపుతూ ధోలా - సాదియాల మధ్య బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన భారీ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోదీ, దేశంలోని ఈ అతిపెద్ద బ్రిడ్జికి నామకరణం చేశారు. దీనికి ప్రఖ్యాత అసోం గాయకుడు భూపెన్ హజారికా పేరును పెడుతున్నట్టు తెలిపారు. భూపెన్ పేరు పెట్టడం ఆయనకు ఇస్తున్న గౌరవమని, ఇకపై నిత్యమూ ఆయన్ను తలచుకుంటూ ఈ ప్రాంత వాసులు వంతెనపై ప్రయాణం చేస్తారని అన్నారు.

 బ్రహ్మపుత్రకు ఉపనదిగా ఉన్న లోహితపై 9 కిలోమీటర్లకు పైగా పొడవుతో నిర్మితమైన ఈ వంతెన జాతి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రికార్డు సమయంలో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఎన్డీయే పాలన ప్రారంభమైన మూడేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశామని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య భారతావనిపై చిన్నచూపును ప్రదర్శించాయని ఆరోపించిన ఆయన, తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడటమే కాకుండా, వృద్ధి పథంలోనూ నడిపిస్తుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News