: నమ్మలేని నిజం.. సీఎం యోగిని కలవాలంటే దళితులు సెంటు, పౌడరు పూసుకోవాలట!


నమ్మలేకపోతున్నా ఇది ముమ్మాటికీ నిజం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకోవాలంటే దళితులు శుభ్రంగా స్నానం చేసి, సెంటు, పౌడరు పూసుకొని వెళ్లాలట. ఇలాంటి ఘటనే నిన్న ఉత్తరప్రదేశ్ లోని ముషార్ దళితవాడలో చోటు చేసుకుంది. దళితవాడకు యోగి వస్తున్నారంటూ... అక్కడున్న దళితులకు కుషాయినగర్ జిల్లా అధికారులు సబ్బులు, షాంపూలు, సెంటులు, పౌడర్లు పంపిణీ చేశారట. ముఖ్యమంత్రిని కలవాలంటే స్నానం చేసి, సెంటు, పౌడరు పూసుకోవాలని అధికారులు ఆదేశించారట. ఈ సందర్భంగా ఓ దళిత నాయకుడు మాట్లాడుతూ, సీఎంను కలవడానికి తాము స్నానం చేసి సెంటు పూసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే, యోగి వచ్చినందుకు కొత్తగా మరుగుదొడ్లు నిర్మించారని, రోడ్లకు మరమ్మతులు చేశారని, వీధి దీపాలు కూడా అమర్చారని దళితవాడ వాసులు చెప్పారు. 

  • Loading...

More Telugu News