: లండన్ లోని బార్ లో అలియాకు అవమానం... అయినా సంబరపడిపోతున్న ముద్దుగుమ్మ!


ప్రముఖ బాలీవుడ్ యువనటి అలియా భట్ కు లండన్ లో చేదు అనుభవం ఎందురైంది. అయినప్పటికీ అలియా సంబరపడిపోతోంది. ఈ విషయం తనే చెప్పింది. ఈ వివరాల్లోకి వెళ్తే.... ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అలియా భట్ లండన్‌ లోని ఓ బార్‌ కి వెళ్లింది. బార్ బయట సెక్యూరిటీ సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మండిపడ్డ అలియా ఎందుకు అడ్డుకున్నారని నిలదీసింది. తాము మైనర్ యువతులను అనుమతించమని వారు సమాధానం ఇచ్చారు. దీంతో తాను మైనర్ ని కాదని, తన వయసు 24 సంవత్సరాలని ఐడీ కార్డులు చూపించిందట. అయినా వారు పట్టించుకోలేదట. దీంతో అలియా ఉస్సూరుమనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటన తరువాత తనను మైనర్ గా భావించడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఉన్న వయసు కంటే తక్కువ వయసు ఉన్నట్టు అనిపిస్తే ఆనందమే కదా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. 

  • Loading...

More Telugu News