: అదృశ్యమైన సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ లభ్యం


ఈ నెల 23న అసోంలోని తేజ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఏటీఎఫ్ తో సంబంధాలు తెంచుకుని అదృశ్యమైన భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ సుఖోయ్-30 విమానం ఆచూకీ మూడు రోజుల తరువాత తెలిసింది. ఈ విమానం శకలాలు అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, మరింత సమాచారం కోసం బ్లాక్ బాక్స్ ను గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. విమానంలోని వారు మరణించి వుండవచ్చని, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుందని తెలిపారు.

  • Loading...

More Telugu News