: జైలుకెళ్లిన టీడీపీ నేతలను తలచుకుని కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే అనిత


పదేళ్ల నాడు జరిగిన ఓ హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఇప్పుడు కేసులో ఇరుక్కుని రోడ్డున పడ్డాయని, జైల్లో ఉన్న నాయకుల్లో పలువురు తనకు సోదరుల వంటి వారని చెప్పిన పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, వారికి జైలు శిక్ష విధించడంపై కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు తీర్పు కాబట్టి ఎవరూ కామెంట్ చేయరాదని అంటూనే, పార్టీ పట్టించుకోకనే నాయకులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇక రాజకీయాలు ఎలా చేయాలని ఆమె తన ఆదేదనను వ్యక్తం చేశారు. నక్కపల్లి తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆమె, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పనికిరాని గొడవలు సృష్టించి, నమ్మిన వారిని నట్టేట ముంచారని, ఈ హత్యతో తెలుగుదేశం వారికి సంబంధం లేదని, వారిని కాపాడుకునేందుకు హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. విశాఖపట్నం నగరానికి మహానాడు నిమిత్తం వచ్చే చంద్రబాబుకు, విషయాన్ని తెలిపి ఆయన సాయం కోరతానని అన్నారు.

  • Loading...

More Telugu News