: దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న సచిన్ పేరు.. నీకెవరూ సాటిలేరన్న కపిల్ దేవ్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ రిటైరైన ఇన్నేళ్ల తర్వాత... మళ్లీ ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. సచిన్ జీవిత చరిత్రపై నిర్మించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. సచిన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ప్రతి థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు... సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పాడు. క్రికెట్ ఆల్ టైం గ్రేట్ కపిల్ దేవ్ కూడా దీనిపై స్పందించారు. "'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. సచిన్, నీకెవరూ సాటిరారు" అంటూ ట్వీట్ చేశారు.