: టీఆర్ఎస్ లో చేరనున్న సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి తండ్రి!
ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి తండ్రి పైడిపల్లి రవీందర్ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన... తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఈయన ఏపీపీఎస్సీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈ నెల 29వ తేదీన రవీందర్ రావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని... బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ఆయతో కలసి పనిచేయాలన్న ఆకాంక్షతోనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నాని రవీందర్ రావు తెలిపారు.