: ఈశాన్యాన నవశకం... బ్రహ్మపుత్రకు మణిహారం.. అతి పొడవైన వంతెన ప్రారంభం!


ఈశాన్యాన నవశకం ఆరంభమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో నిర్మాణం ప్రారంభమైన దోలా - సాదియాల మధ్య బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఆరేళ్ల తరువాత జాతికి అంకితమైంది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రహ్మపుత్రకు మణిహారమైన వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, అసోం సీఎం సోనోవాల్ లతో కలసి, తొలిసారిగా 9 కిలోమీటర్లకు పైగా పొడవైన బ్రిడ్జిపై ఆయన తన కాన్వాయ్ లో ప్రయాణించారు.

ఈ సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన అసంఖ్యాక ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ఈ వంతెనతో అసోం- అరుణాచల్ ప్రదేశ్ ల నడుమ వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో పాటు సరుకు రవాణా సులభం కానుంది. రూ. 2,050 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలుగు సంస్థ 'నవయుగ' ఈ వంతెనను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బాంద్రా - వర్లీ నడుమ ఉన్న 5 కిలోమీటర్ల వంతెన దేశంలోనే ఓ నదిపై ఉన్న అతిపెద్ద వంతెన కాగా, దాన్ని దోలా - సాదియా వంతెన అధిగమించింది.

  • Loading...

More Telugu News