: ఎట్టి పరిస్థితుల్లోను 'సచిన్'ను మిస్ కాకండి: ధోనీ
'సచిన్' సినిమాలో తనను బాగా ఆకట్టుకున్న అంశం... కుటుంబ సభ్యులతో అతను ఉన్న సన్నివేశాలని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అన్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల అభిప్రాయాలను చాలా చక్కగా చూపించారని కితాబిచ్చాడు. ఇవి చాలా హత్తుకునేలా ఉన్నాయని... ఇలాంటి వీడియోలనే తాను కోల్పోయానని చెప్పాడు. పిల్లలతో సచిన్ ఆడుకుంటున్న దృశ్యాలు, తల్లిదండ్రులు, అంజలితో గడిపిన గొప్ప క్షణాలు తనకు బాగా నచ్చాయని తెలిపాడు. సచిన్ విషయంలో అంజలి వదిన ఎలా ఆలోచిస్తారనే విషయం కూడా ఇందులో చూపించారని చెప్పాడు. తన కెరియర్ కోసం సచిన్ ఏం త్యాగం చేశాడో, అతనికి ఎవరు మద్దతిచ్చారో ఈ సినిమా ద్వారా తెలుస్తుందని ధోనీ తెలిపాడు. ఈ సినిమాను చూడటం చాలా ఆనందకరమని... ఎవరూ మిస్ కాకూడదని సూచించాడు. టీమిండియా ఆటగాళ్లతో పాటు, కొందరు వీఐపీలు, సెలబ్రిటీలకు ఈ సినిమా ప్రత్యేక షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన తర్వాత ధోనీ పైవిధంగా స్పందించాడు.