: కాస్తంత ఉపశమనం... నాలుగు రోజుల పాటు వర్షాలు
ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనాన్ని ఇస్తూ, వచ్చే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని, నేడు విపరీతమైన వడగాలులు వీచే అవకాశాలున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇదిలావుండగా, రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా విస్తరించేంత వరకూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.