: చలపతిరావునే కాదు.. నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలి: టీ.కాంగ్రెస్ నేత, మహిళా సంఘాలు
మహిళల పట్ల సీనియర్ సినీ నటుడు చలపతిరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇంకా వేడిని పుట్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చలపతిరావు, యాంకర్ రవిలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉజ్మాషాకీర్ మరో డిమాండ్ చేశారు. చలపతిరావుపై నిర్భయ చట్టం కింది కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు హైదరాబాదులోని రాజేంద్రనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు... నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలను లైవ్ లో ప్రసారం చేయించినందుకు సినిమా నిర్మాత అయిన నాగ్ ను అరెస్ట్ చేయాల్సిందేనని తెలిపాయి. చలపతిరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.