: డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్ నర్ పై ఎఫ్బీఐ విచారణ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ సలహాదారుగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న జారెడ్ కుష్ నర్ పై ఫెడరల్ బ్యూరో అధికారులు విచారణ ప్రారంభించారు. 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా ప్రతినిధులు, వ్యాపారులతో కుష్ నర్ వరుస సమావేశాలు జరిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత డిసెంబరులో రష్యా దౌత్యాధికారి, మాస్కో నుంచి వచ్చిన ఓ బ్యాంకర్ తో కుష్ నర్ సమావేశమయ్యారన్న అంశంపై ఈ విచారణ జరుగుతోంది.

ఇది అధ్యక్షుడి అల్లుడిపై జరుగుతున్న విచారణ కావడంతో పూర్తి వివరాలు బయటకు పొక్కడం లేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్టు 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్, ట్రంప్ ప్రచార బాధ్యతలు చూసిన మాజీ అధికారి పౌల్ మనఫోర్ట్ లనూ ఎఫ్బీఐ అధికారులు విచారించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో కీలక సమాచారమంతా కుష్ నర్ వద్దే ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, విచారణ కుష్ నర్ ను ఇబ్బంది పెట్టేలా సాగడం లేదని, అయితే, ట్రంప్ ఎన్నికల్లో గెలిచేందుకు రష్యా ఏ విధంగానైనా సాయపడిందా? అన్ని కోణంలో ఎంక్వయిరీ సాగుతోందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News