: కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్ విమానమెక్కిన వైఎస్ జగన్
న్యూజిలాండ్ పర్యటన నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన కుటుంబ సభ్యులతో కలసి గత రాత్రి విమానం ఎక్కారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో జగన్ న్యూజిలాండ్ కు బయలుదేరారు. పలువురు వైకాపా నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు. రెండు వారాల పాటు జగన్ న్యూజిలాండ్ లో గడపనున్నారు. కాగా, తాను న్యూజిలాండ్ కు వెళ్లేందుకు అనుమతించాలని గత నెలలో జగన్ కోర్టు అనుమతిని కోరగా, సీబీఐ అభ్యంతరాలు పెట్టింది. అయితే, కోర్టు ఆ అభ్యంతరాలను తిరస్కరిస్తూ, కుటుంబ సభ్యులను తీసుకుని విదేశాలకు వెళ్లదలిస్తే సరేనని అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరిగి వైఎస్ జగన్, జూన్ 10న స్వదేశానికి రానున్నట్టు సమాచారం.