: పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ప్రేమ కోసమే భారత్ లో ప్రవేశించారా?


బెంగళూరులో నిన్న సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ముగ్గురు పాకిస్థానీలతో పాటు ఒక కేరళీయుడ్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసు విచారణలో ఆసక్తికర కోణం వెలుగు చూసింది. పాకిస్థాన్ కు చెందిన యువతి సమీరా, కేరళకు చెందిన యువకుడు మహ్మద్ షిహాబ్ (30) ఉద్యోగం కోసం మస్కట్‌ కు చేరారు. అక్కడ ప్రేమలో పడ్డారు. అలాగే పాకిస్థాన్ కు చెందిన కిరణ్ గులాం అలీ (25), ఖాసిఫ్ షంషుద్దీన్ (30) కూడా ప్రేమించుకున్నారు. వారు కూడా ఖతార్ లోనే ప్రేమలో పడ్డారు. అయితే ప్రేమను గెలిపించుకునేందుకు సక్రమ మార్గం అనుసరించకుండా వీరంతా అక్రమ మార్గం ఎంచుకున్నారు. నేపాల్ మీదుగా పాట్నా, అక్కడి నుంచి బెంగళూరు వచ్చి నివసిస్తున్నారు. దీంతో బెంగళూరులో అక్రమంగా ఉంటున్న వారిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News