: ఐదేళ్లలో ఇస్తామన్న నిధులవి... కేసీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారు: వెంకయ్యనాయుడి వివరణ
వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణకు ఇస్తామని అమిత్ షా చెప్పిన నిధుల లెక్కలను కేసీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా ను తప్పుబడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. విభేదాలు పెట్టుకోవడం తమ నైజం కాదని, అన్ని రాష్ట్రాలతో మైత్రీ బంధాన్ని కొనసాగించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. విజయవాడ సమావేశాన్ని నాందిగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు, అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం విజయవంతమైందని అన్నారు. భాజపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వెల్లువలా తరలివచ్చారని, ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని అన్నారు.