: మళ్లీ తెగబడ్డ మావోలు... రైల్వే స్టేషన్ పై దాడి


మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. జార్ఖండ్ జిల్లా బొకారో సమీపంలోని డుమ్రి బిహార్ రైల్వే స్టేషన్ పై దాడి చేసి కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం కలిగించారు. స్టేషన్ లోని సిగ్నల్ సెట్, సమాచార వ్యవస్థకు నిప్పుపెట్టారు. అక్కడికి సమీపంలోనే ఉన్న గూడ్స్ రైలు ఇంజన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు డుమ్రి బిహార్ స్టేషనుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. కనీసం 20 మంది వరకూ నక్సల్స్ దాడికి పాల్పడ్డారని, వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News