: రామగుండం.. అగ్నిగుండం
ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని రామగుండం పట్టణం అధిక వేడితో అగ్నిగుండంలా మారిపోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బొగ్గుగనులు, విద్యుత్ కర్మాగారాలు ఉండడంతో అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెంట చింతల, నిజామాబాద్, కర్నూలులో 43 డిగ్రీలు, నల్గొండలో 42, హైదరాబాద్, తిరుపతిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.