: అసోంను కుదిపేసిన బాంబు పేలుడు.. మోదీ రాకకు నిరసనగానే!
ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఒక్క రోజు ముందు బాంబు పేలుడుతో అసోం దద్దరిల్లింది. దిబ్రూగఢ్ జిల్లాలోని దికోమ్ చరియాలోని ఓ ఆయిల్ పైప్‌లైన్‌లో ఈ బాంబు పేలుడు సంభవించింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) ఈ బాంబును పేల్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ తామే ఈ పనిచేసినట్టు ఉల్ఫా (ఐ) సంస్థ ప్రకటించింది. బాంబు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి అనుమానిత ఉల్ఫా (ఐ) తీవ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. బాంబు ప్రమాదవశాత్తు పేలడంతో అతడు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాంబు దాడితో అప్రమత్తమైన కేంద్ర హోంమంత్రిత్వశాఖ అసోం పోలీసులను అప్రమత్తం చేసింది. ఉల్ఫా (ఐ) మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.