: ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలుగుబంటితో ఫైటింగ్ చేసిన వేటగాడు!
అడవి జంతువులతో మనుషులు ఫైటింగ్ చేసే సీన్‌లు మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, కెనడాలోని ఒంటారియోలో ఫైర్ నది పక్కన రిచర్డ్ వెస్లీ అనే ఓ వ్యక్తికి, ఓ నల్లటి ఎలుగుబంటికి మధ్య ఫైటింగ్ జరిగింది. రిచర్డ్ వెస్లీ సరదాగా వేటకు వెళ్లిన సందర్భంగా అతడికి దూరంగా ఓ ఎలుగుబంటి కనిపించింది. తనను అది ఏమీ చేయబోదని అనుకున్నాడు. అయితే, ఒక్కసారిగా అది అతడివైపునకు పరుగులు తీసింది. దాంతో తన వద్ద ఉన్న బాణాన్ని దానివైపు ఎక్కుపెట్టి దాన్ని భయపెట్టాలని చూశాడు. అయినా భయపడకుండా అది అతడిపై దాడి చేయడానికి వచ్చేసింది.
అతడు బాణం సందించేలోగా అతడిపైకి దూకేసింది. దీంతో అతడు తన ప్రాణాలను రక్షించుకునే క్రమంలో దానితో ఫైటింగ్ చేశాడు. చివరికి ఆ ఎలుగుబంటి అతడిని వదిలి వెళ్లిపోవడంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యం అతడి వద్ద ఉన్న ఓ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను మీరూ చూడండి...