: కొత్త పార్టీ పెట్టమని రజనీకాంత్ కు ట్వీట్ చేసిన శత్రుఘ్నసిన్హా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, వేరే పార్టీలో ఆయన చేరడం కన్నా, కొత్తపార్టీనే స్థాపిస్తే అందులోకి మిగిలిన వాళ్లు వచ్చి చేరతాని బీజేపీ నేత, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్ర సిన్హా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘టైటానిక్ హీరో ఆఫ్ తమిళనాడు, సన్ ఆఫ్ ఇండియా- డియరెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్!.. నీ దేశ ప్రజల భవిష్యత్ కోసం నిర్మాణాత్మక రాజకీయాల్లోకి రజనీ అడుగుపెట్టాలని జాతి ఎదురుచూస్తోంది. ప్రజలు నీ వెంట ఉన్నారు. నీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వేరే పార్టీలో మీరు చేరడం కన్నా, మీ తోనే వారు జతకట్టడం ఉత్తమం. మీ కుటుంబసభ్యులను, సన్నిహితులను, నిపుణులను సంప్రదించి మీరు సరైన నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా తీసుకుంటారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఓ స్నేహితుడిగా, మద్దతుదారుడిగా, వెల్ విషర్ గా, ఓ గైడ్ గా నేను రజనీకాంత్ కు సాయం చేస్తా..’ అని ఆయా ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.