: తెలంగాణ ముస్లిం ఉద్యోగులకు శుభవార్త.. రంజాన్ దృష్ట్యా కార్యాలయాల నుంచి గంట ముందుగానే వెళ్లొచ్చు!
తెలంగాణలో పని చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు శుభవార్త. రంజాన్ దృష్ట్యా ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పొరుగు సేవల సిబ్బంది ఒక గంట ముందుగానే తమ కార్యాలయాల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 27 నుంచి జూన్ 25 వరకు ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి సాయంత్రం నాలుగు గంటలకే వెళ్లవచ్చు.