: ప్రతి పాఠశాలలో ఈ సినిమా ప్రదర్శించాలని సచిన్ కు చెప్పా: అమితాబ్ బచ్చన్
‘సచిన్’ సినిమా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తుందని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని, ఈ సినిమాను ప్రతి పాఠశాలలో ప్రదర్శించాలని సచిన్ కు చెప్పానని అన్నారు. ఈ సినిమాలో సచిన్ జీవితం గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఉద్వేగానికి లోనవుతామని అన్నారు. కాగా, క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ ను నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అమితాబ్ సహా పలువురు బాలీవుడ్ నటులు హాజరయ్యారు.