: ఏపీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది: బీజేపీ ఎంపీ హరిబాబు


ఏపీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఈ రోజుకు మూడేళ్లు అవుతుందని, పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేపట్టారని అన్నారు.

ఏపీపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఎంతో ప్రయోజనకరంగా ఉందని, రాబోయే రోజుల్లో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. త్వరలో అన్ని బూత్ కమిటీల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఏపీలో బీజేపీని ఒక శక్తిమంతమైన పార్టీగా తయారు చేస్తామని ఈ సందర్భంగా అమిత్ షాకు హామీ ఇస్తున్నానని అన్నారు. కార్యకర్తల,నాయకులు సహకారంతో రాష్ట్రంలో బీజేపీ విస్తరణ జరుగుతుందని తాను ఆశిస్తున్నానని హరిబాబు అన్నారు.

  • Loading...

More Telugu News