: ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను 'సామ్'నే ఎందుకు లవ్ చేశాను?: సమంతను అడిగిన నాగచైతన్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ఆ సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. ఓ టీవీ ఛానెల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ సరదాగా మాట్లాడుకొని ప్రేక్షకులను అలరించారు. కాగా, ప్రోగ్రాం మధ్యలో యాంకర్.. నాగచైతన్యతో సమంతకు ఫోన్ చేయించి, ఓ విషయాన్ని అడిగించాడు. 'ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను సమంతనే ఎందుకు లవ్ చేశాను?' అంటూ నాగచైతన్య సమంతను అడిగాడు. అందుకు సమంత సమాధానం చెబుతూ ‘నేను నీకు ఆ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అని చెప్పింది. దీంతో చైతు 'సరే నాకు ఇంకో ఆప్షన్ వద్దులే' అని అన్నాడు. తర్వాత సమంత ఐలవ్యూ అని చెప్పింది. సమంత ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి హా..హా..హా అని పేర్కొంది.