: అమిత్ షాతో విందు భోజనాలు సిగ్గుచేటు: చంద్రబాబుపై కేవీపీ ఫైర్


బీజేపీ దగాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రులకు ప్రధాని మోదీ తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, విందు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ కూటమి నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. టీడీపీ-బీజేపీ కూటమిని ఏపీ ప్రజలు తరిమి కొడతారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News