: ధోనీకి స్థానం కల్పించి, నాకెందుకు కల్పించలేదు?: హర్భజన్


ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో తనకు స్థానం లభించకపోవడంపై స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానం దక్కుతుందని తాను ఆశించానని చెప్పాడు. తనకు ఎందుకు స్థానం కల్పించలేదో అర్థం కావడం లేదని అన్నాడు. ధోనీకి ఇచ్చిన ప్రాధాన్యతను ఎప్పటి నుంచో ఆడుతున్న తనకు ఇవ్వలేదని వాపోయాడు. టీమ్ సెలెక్షన్ నిజాయతీగా జరిగిందని తాను భావించడం లేదని అన్నాడు.

ధోనీ గురించి హర్భజన్ మాట్లాడుతూ అతనికున్న అనుభవం రీత్యా ఫామ్ లో ఉన్నా, లేకపోయినా జట్టులో అతన్ని ఎంపిక చేస్తారని చెప్పాడు. గత కొంత కాలంగా ధోనీ బ్యాటింగ్ గొప్పగా ఏమీ లేదని... అయితే మాజీ కెప్టెన్ కావడంతో అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ధోనీకి ఉందని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో ధోనీ అనుభవం యువ క్రికెటర్లకు తోడ్పడుతుందని అన్నాడు. అయితే, ధోనీకి ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వనందుకు బాధగా ఉందని చెప్పాడు. 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా...  రెండు ప్రపంచకప్ లకు ప్రాతినిధ్యం వహించా... అయితే అవేవీ పట్టించుకోలేదని మండిపడ్డాడు. ఐపీఎల్ లో గొప్పగా రాణించిన గౌతమ్ గంభీర్ ను కూడా పక్కన పెట్టారని విమర్శించాడు. 

  • Loading...

More Telugu News