: కేసీఆర్ కు అంత దమ్ము లేదు.. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా బీజేపీకి మద్దతు ఇవ్వద్దు: తమ్మినేని


రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోందని సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న దానికన్నా కేంద్రానికి రాష్ట్రం ఇస్తున్నదే ఎక్కువని అన్నారు. సీఎం కేసీఆర్ వెన్నెముక లేని వ్యక్తి అని... కేంద్రంతో పోరాడేంత దమ్ము ఆయనకు లేదని విమర్శించారు. కేసీఆర్ కు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వరాదని అన్నారు.

 కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి... ఆ నిధులను ఏయే కార్యక్రమాలకు, ఎంతెంత ఖర్చు చేశారు అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా దళితుల మీద, వారి ఆహార పద్ధతుల మీద దాడులు జరుగుతున్నాయని... వాటిని పట్టించుకోకుండా దళితవాడల్లో భోజనాలు చేస్తే పాపం పోదని మండిపడ్డారు. భువనగిరి జిల్లాలో ఓ అగ్రకుల అమ్మాయిని ప్రేమించిన యువకుడు 23 రోజులుగా అదృశ్యమైతే ఇంతవరకు అమిత్ షా కాని, కేసీఆర్ కాని నోరు మెదపలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News